తెలంగాణ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కనుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామాలలో ఒకటిగా ఎంపిక చేసింది. డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే UNWTO జనరల్ అసెంబ్లీ 24వ సెషన్ సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఇవ్వబడుతుందని భారత ప్రభుత్వం తెలిపింది. భారత దేశం నుంచి మూడు గ్రామాలు మేఘాలయలోని కోంగ్‌తాంగ్, మధ్యప్రదేశ్‌లోని లాధ్‌పురా ఖాస్, తెలంగాణలోని పోచంపల్లి గ్రామాలు పోటీ పడగా పోచంపల్లిని విజయం వరించింది. పోచంపల్లిలో నేసే ఇక్కడ వస్త్రాలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పోచంపల్లికి పేరు ఉంది. భూదానోద్యమం జరగడం వల్ల పోచంపల్లికి భూధాన్ పోచంపల్లి అని పేరు వచ్చింది.
తెలంగాణ గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు… భూదాన్ పోచంపల్లికి యూఎన్ అవార్డ్
-