పద్మ శ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్ లో లెవనెత్తుతా అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అలాగే బండి సంజయ్ కార్పొరేటర్ కాదు కేంద్ర మంత్రి అని గుర్తు పెట్టుకోవాలి. హరీష్ రావు ముందు కేసీఆర్ ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలి. కేంద్రం బీహార్ కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదు. అందుకే బడ్జెట్ లో మొండి చేయి చూపిస్తున్నారు. ఈ సారి అయిన లోకసభలో విభజన హామీల గురించి బీజేపీ ఎంపీలు మాట్లాడాలి. రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు డిల్లికి పోయాడో కేటిఆర్ ను అడిగితే వ్యంగ్యంగా చెప్తాడు.
ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి మోడీని రాష్ట్రానికి పెద్దన్న లాగ ఉండమన్నారు. కాంగ్రెస్ లో 8మంది ఎంపీలు ఉన్నారు. తెలంగాణ ప్రజలు 8మంది బిజేపి ఎంపిలను గెలిపించారు. మిమ్ముల్ని గెలిపించింది ఎందుకు. లక్ష్మణ్ రాజ్య సభ ఎంపీగా ఉండి rrr పై భువనగిరి పోయి ఫిర్యాదు చేయడం పై వాళ్ల వైఖరి అర్థం చెసుకోవచ్చు. హైదరాబాద్ rrr కోసం కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. rrr హైదరాబాద్ లైఫ్ లైన్ దానికి 45వేల కోట్లు అవసరం. rrr, metro, తో హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుంది అని భువనగిరి ఎంపీ అన్నారు.