కామారెడ్డి జిల్లా బీబీపేట్‌ చెరువుకు గండి.. 200 ట్రాక్టర్లతో మట్టి

-

కామారెడ్డి జిల్లా బీబీపేట్‌ చెరువుకు గండి పడింది. దింతో వందలాది ఎకరాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. 200 ట్రాక్టర్ల మట్టి పోసినా గండి పూడలేదు. సురక్షిత ప్రాంతానికి 100 కుటుంబాలను తరలించింది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. రాంపూర్, నస్కల్, నంద గోకుల్ గ్రామాలను ముంచెత్తింది వరద నీరు.

Bibipet Lake in Kamareddy district
Bibipet Lake in Kamareddy district

మూడు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కసరత్తు చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది. భారీగా నష్టం వాటిల్లే అవకాశముందని అధికారుల అంచనా వేస్తున్నారు.

కాగా కామారెడ్డి – కరీంనగర్ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. పాల్వంచ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కామారెడ్డి – కరీంనగర్ మధ్య రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. లక్ష్మీ రావులపల్లి, మంతెన దేవులపల్లి ఊర్ల మధ్య పూర్తిగా స్తంభించిపోయాయి రాకపోకలు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news