రూ.56 లక్షల జీహెచ్ఎంసీ నిధులు కాజేసింది మహిళా కంప్యూటర్ ఆపరేటర్. జీహెచ్ఎంసీలో క్రమక్రమంగా అవినీతి బాగోతాలు బయటపడుతున్నాయి. శేరిలింగంపల్లి జోన్‌లోని చందానగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో పౌర సేవ కేంద్రాల్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు సుభాషిణి అనే మహిళ. ట్రేడ్ లైసెన్స్, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ఆస్తి పన్ను దరఖాస్తుల స్వీకరణ వంటి పనులకు ప్రజల నుండి వసూలు చేసిన డబ్బులు జీహెచ్ఎంసీ ఖజానాలో జమ చేయలేదని తేల్చారు ఆడిటర్లు.

2024–25 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు రూ.56 లక్షలు కాజేసినట్టు నిర్ధారించారు ఆడిట్ అధికారులు. ఆడిట్ జరుగుతుందని తెలిసి విధులకు హాజరు కాకపోవడంతో, ఆమెను బలవంతంగా కార్యాలయానికి రప్పించారు ఉన్నతాధికారులు. నిధులు కాజేసినట్టు అంగీకరించి, కేవలం ఒక్క రోజులోనే జీహెచ్ఎంసీ ఖాతాలో రూ.56 లక్షలు జమ చేసారు మహిళా ఆపరేటర్ సుభాషిణి.