మోడీకి కాల్ చేసిన బైడెన్..

-

అమెరికా నూతన అధ్యక్ష్యుడు జొ బైడెన్ మన ప్రధాని మోడీకి కాల్ చేశారు. మోడీతో బైడెన్ మాట్లాడడం ఇదే మొదటి సారి. ప్రాంతీయ సమస్యలు, భాగస్వామ్య ప్రాధాన్యతల మీద చర్చ జరిగినట్టు చెబుతున్నారు. వాతావరణ మార్పుల మీద ఇరు దేశాల మధ్య ఉన్న సహకారం అలానే కొనసాగించాలని చర్చలలో నిర్ణయం తీసుకున్నారు.

ఇక వెంటనే మోడీ జో బైడెన్ దంపతులను భారత పర్యటనకు మోడీ ఆహ్వానించారు. ఇండో పసిఫిక్ తో పాటు ఇతర ప్రాంతాల్లో శాంతి భద్రతలను పరిరక్షించే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఎదురు చూస్తున్నామని మోడీ బైడెన్ కు తెలిపారు. ఇక ఈ అంశాలను మోడీ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. నిజానికి అమెరికా ఎన్నికల సమయంలో మోడీ ఒకరకంగా ట్రంప్ కు మద్దతు పలికారు. కానీ ట్రంప్ ఘోరంగా ఓడిపోయి బైడెన్ గెలుపొందిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version