నగరవాసులకు బిగ్ అలర్ట్..ఉరుములు, మెరుపులతో భారీ వర్ష సూచన

-

హైదరాబాద్ లో రానున్న రెండు మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కుండపోత వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది.

సికింద్రాబాద్, ఓయూ, అబిడ్స్, అల్వాల్, కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, కాప్రా, ఖైరతాబాద్, కూకట్‌పల్లి,ఉప్పల్, కుతుబుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతుండడంతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది అందరూ ఫీల్డ్ లోనే ఉండాలని ,ఓపెన్ నాలాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. వాహనాదారులు రోడ్లపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.రానున్న 48గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news