తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ముందుగా జ్యోతిబాపూలే ప్రజా భవన్‌లో రాజీవ్ సివిల్స్ అభయహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన సివిల్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో సీఎం చేతుల మీదుగా రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు.
ఈ సందర్బంగా మీడియాతో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. యువత సహకారంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అందులో భాగంగా ప్రగతి భవన్..ప్రజాభవన్‌గా మారిందని వివరించారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామని, అత్యంత వెనుకబడిన బిహార్ నుంచి అనేకమంది సివిల్స్‌కు ఎంపిక అవుతుంటే.. ఇక్కడ కూడా అలాంటి వారిని తయారు చేయాలనే ఉద్దేశ్యంతో సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు.ఇంటర్వ్యూకు వెళ్లే వారు తప్పక సివిల్స్‌లో సెలెక్ట్ అవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.ఇక మార్చి 31లోగా 563 గ్రూప్-1 ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయనున్నట్లు ప్రకటించారు.