దేశ ప్రజలకు ప్రధాని మోడీ మరో శుభవార్త చెప్పారు. నమో భారత్ మెట్రోను ప్రారంభించారు ప్రధాని మోడీ. ఆదివారం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో నమో భారత్ ర్యాపిడ్ ట్రాన్సిట్ రైలు ను ప్రారంభించారు. ఇవాళ ఢిల్లీలో ₹12,200 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
నమో భారత్ ర్యాపిడ్ ట్రాన్సిట్ రైలుతో సహా ₹12,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి పాల్గొన్నారు. ఇక దీనిపై ఢిల్లీ సిఎం అతిషి మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఢిల్లీలో రవాణా రంగాన్ని చాలా ముందుకు తీసుకెళ్తున్నాయని తెలిపారు. ఈ రోజు పార్క్ నుంచి జనక్‌పురి వెస్ట్, ఢిల్లీని ఎన్‌సిఆర్ ప్రాంతంతో కలుపుతూ, సాహిబాబాద్ నుండి న్యూ అశోక్ నగర్ వరకు ర్యాపిడ్ రైల్ మొదటి స్ట్రెచ్ ప్రారంభించబడిందని తెలిపారు. రితాలా నుంచి వెళ్ళే కొత్త మెట్రో లైన్ శంకుస్థాపన జరుగుతోంది. కుండ్లికి కూడా వేయబడుతోందని వివరించారు.