బిగ్ అలర్ట్.. ఆధార్ విషయంలో.. మోదీ సర్కార్ కీలక నిర్ణయం..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ కార్డు వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది ఆధార్. ఆధార్ బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చెయ్యడానికి మొదలు ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టడం దాకా ఆధార్ తప్పక ఉండాలి. అయితే ఇలా ప్రతీ పనికి కూడా ఆధార్ పక్కా ఉండాలి. ఆధార్ కార్డుని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. 2022, నవబంర్ 30 నాటికి దేశం లో దాదాపు 135 కోట్ల ఆధార్ కార్డులు జారీ చేసింది.

ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పూర్తి వివరాలు చూస్తే.. అథెంటికేషన్ అంశానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది కేంద్రం. ఈ ఆధార్ అథెంటికేషన్ ని ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలు, మంత్రిత్వ శాఖలు మాత్రమే చేస్తున్నాయి. వాటి పరిధిని విస్తరించాలని కేంద్రం అనుకుంటోంది. దీనిలో భాగంగా ప్రైవేటు కంపెనీలకు కూడా ఆధార్ అథెంటికేషన్ అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలతో పాటు ఇతర ప్రైవేటు సంస్థల తో అథెంటికేషన్ ని ప్రారంభించాలని చూస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు కొత్త నియమాలు ప్రతిపాదించింది.

ప్రభుత్వ విభాగాలు అందించే ప్రయోజనాలు, సేవలు, రాయితీల కోసం ఆధార్ అథెంటికేషన్ నిర్వహించడానికి ప్రైవేటు సంస్థలను కూడా అనుమతించేలా ఈ రూల్స్ ఉంటాయి. ఆధార్ అథెంటికేషన్ సేవలు పొందాలని భావించే ప్రైవేటు సంస్థలు కేంద్ర సర్కార్ నుంచి ముందుగానే అనుమతులు తీసుకోవాల్సి వుంది. కేంద్రం అనుమతించిన ప్రైవేటు సంస్థలు మాత్రమే ఆధార్ అథెంటికేషన్ చేయడానికి కుదురుతుంది. మిగతా సంస్థల్లో ఆధార్ అథెంటికేషన్ చెయ్యడం అవ్వదు. ప్రస్తుతం ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే ఫ్రీగానే అప్‌డేట్ చేసుకోవచ్చు. 10 ఏళ్లకు పైగా ఆధార్ అప్‌డేట్ చేయకపోతే కూడా ఫ్రీగానే అప్‌డేట్ చేసుకోవచ్చు. జూన్ 14 వరకు అవకాశం వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version