మీకు సంసారానికి సమయమెక్కడ.. టెకీ దంపతులకు సుప్రీంకోర్టు ప్రశ్న

-

నేటి సమాజంలో విడాకుల కేసులు ఎక్కువవుతున్నాయి. ఒకప్పుడు అన్ని రకాలుగా సర్దుకుపోయి బతికే జంటలు.. నేడు కాస్త విభేదాలు వచ్చిన కోర్టు మెట్లెక్కుతున్నాయి. ఈ మధ్య కాలంలో పరస్పర అంగీకారంతో విడిపోయే జంటలు ఎక్కువగా ఉంటున్నారు. అలా ఓ జంట సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

దంపతులుగా కలిసి ఉండటానికి సమయం కేటాయించలేకపోతున్న మీరు మీ వివాహాన్ని నిలబెట్టుకునేందుకు మరో అవకాశం ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటూ విడాకుల కోసం వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ జంటను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ‘’మీరు బెంగళూరులో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఒకరు పగలు ఉద్యోగానికి వెళ్తే.. మరొకరు రాత్రి వెళ్తున్నారు. ఇక ‘మీకు సంసారానికి సమయమేది? విడాకులు తీసుకోవడంపై మీకు విచారంలేదు. అయినప్పటికీ పెళ్లి బంధాన్ని నిలుపుకోవడానికి రెండో అవకాశం ఎందుకు తీసుకోరు’’’ అంటూ జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం అడిగింది. ‘‘

తిరిగి కలిసుండేందుకు ఈ జంటకు ఓ అవకాశం ఇవ్వాలి’’ అని జస్టిస్‌ నాగరత్న సూచించారు. అయితే ఆ దంపతులు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడానికే నిశ్చయించుకుని ఓ ఒప్పందానికి వచ్చారని వారి తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. దీంతో ఆ జంటకు సుప్రీం కోర్టు విడాకులు మంజూరు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version