#నరేష్ 62 మూవీ నుంచి బిగ్ అనౌన్స్మెంట్.. ఈసారి మామూలుగా ఉండదంటూ..!

-

దివంగత ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఇవివి సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలను మించే సినిమాలు చేసిన ఈయన కామెడీ జోనర్ లో సుమారుగా 50కి పైగా చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కొంత గ్యాప్ తీసుకొని రూటు మార్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ సీరియస్ రోల్స్ చేస్తూ కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈయన కం బ్యాక్ తో ప్రయోగాలు చేస్తున్నారు.

అలా నాంది, ఉగ్రం, ఇట్లు మారేడుమిల్లి వంటి చిత్రాలతో సీరియస్ రోల్స్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అల్లరి నరేష్ ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా తన 62వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. నరేష్ 62 అనే వర్కింగ్ టైటిల్ తో ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా మేకర్స్ వదలడం జరిగింది. మూర్ఖత్వం బార్డర్ దాటిన ఒకడి కథ అంటూ మేకర్స్ సినిమా గురించి ప్రకటించారు. ముఖ్యంగా అనౌన్స్మెంట్ తోనే ఆసక్తి పెంచేసిన ఈ సినిమాపై మరొకవైపు వీడియో కూడా ఇంట్రెస్ట్ గా సాగుతోంది. ముఖ్యంగా నరేష్ లుక్ చాలా అగ్రేసివ్ గా కనిపిస్తోందని.. ఒక హోటల్లో టేబుల్ వద్ద కూర్చొని టీ, సిగరెట్ తాగుతున్న స్టిల్స్ లో పోస్టర్స్ ను వదిలారు.

ఇక ఈ చిత్రాన్ని సోలో బ్రతికే సో బెటర్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకులిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే సినిమా టైటిల్ తో పాటు హీరోయిన్, ఇతర నటీనటులను కూడా త్వరలోనే రివీల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news