ఈ రోజు మధ్యాహ్నం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ సాహితి ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు నిండు ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఈ ఘటన గురించి తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చనిపోయిన వారి మృతికి తన సంతాపాన్ని తెలియచేశారు పవన్. ఇక గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు. ఇంకెన్నాళ్లు ఇలా కెమికల్ కంపెనీస్ లో ప్రమాదాలు జరుగుతుంటాయి… ప్రభుత్వం ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉభయ గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నారు. అందరినీ ఏకతాటిపైకి తెచ్చి ఇక్కడ ఉన్న 34 ఎమ్మెల్యే సీట్ లను గెలుచుకోవాలని లక్ష్యంతో ఉన్నారు.
మరి పవన్ కళ్యాణ్ లక్ష్యాన్ని చేరుకుంటాడా ? లేదా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.