ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో సీపీఎం మరియు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కీలక విషయం గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం కమ్యునిస్ట్ నేతలు తమ్మినేని వీరభద్రమ్ మరియు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ… తెలంగాణలో అధికార పార్టీ BRS తో మా స్నేహపూర్వక బంధం కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. బీజేపీ కి వ్యతిరేకంగా ఒక లౌకిక శక్తిని ఏర్పరచడమే మా లక్ష్యం అన్నారు. ఇంకా వీరు మాట్లాడుతూ పొత్తుల కోసం ఎప్పుడూ మేము దిగజారమని… కేసీఆర్ పిలిస్తేనే వెళ్లి కలుస్తామని స్పష్టత ఇచ్చారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మాకు బలమున్న నియోజకవర్గాలలో ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం అవుతామని అన్నారు. ఇంకా ఈ భేటీలో మరికొన్ని కీలక విషయాల పైన వీరు చర్చించుకున్నారు.
మరి వచ్చే ఎన్నికలలో అధికార పార్టీ తమకు వచ్చే సర్వే ఫలితాలను బట్టి కూటములు ఏర్పరుచుకోవడమా లేదా అన్న విషయం గురించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.