RRR MOVIE : ఆర్ఆర్ఆర్ నుంచి రేపే బిగ్ సర్ ప్రైజ్

-

ప్ర‌పంచ‌మంతా ఎంత‌గానో ఎదురు చూస్తున్న ప్ర‌ముఖ మూవీ ఆర్ఆర్ఆర్. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తీస్తున్న మూవీ కావ‌డంతో అంచ‌నాలు ఆక‌శాన్ని తాకుతున్నాయి. ఇక ఇందులో తొలిసారి ఇద్ద‌రు స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, పోస్ట‌ర్లు భారీ హైప్ ను పెంచేశాయి.

ఇది ఇలా ఉండగా.. అయితే…మూడు రోజుల కింద ఓ బిగ్‌ అనౌన్స్‌ మెంట్‌ వస్తుందని ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీం. ఈ మూవీలోని తొలి పాటను ఆగస్టు 1 న ఉదయం 11 గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది.

అయితే కాసేపటి క్రితమే అనౌన్స్‌ మెంట్‌ గురించి మరో పోస్టర్ ను విడుదల చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ బృందం. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని ఓ వీడియో సాంగ్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ పోస్టర్ ద్వారాప్రకటించింది. ఈ సాంగ్‌ ఏకంగా 5 భాషల్లో చేయనున్నట్లు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం ప్రకటించింది. దోస్తీ పేరుతో ఈ సాంగ్‌ సాగనున్నట్లు వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news