హుజురాబాద్‌లో రేవంత్‌రెడ్డి సరికొత్త వ్యూహం.. బీసీ నేత కోసం సెర్చింగ్..?

-

తెలంగాణ రాష్ట్రమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక వైపే చూస్తున్న సంగతి అందరికీ విదితమే. ఈ నియోజకవర్గంలో రాజకీయ రణక్షేత్రంలో ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా సన్నాహక దశలోనే ఉందని చెప్పొచ్చు. అయితే, హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీని నిలిపేందుకు గాను టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి సరికొత్త వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. అదేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్ నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉన్నదన్న సంగతి ప్రతిపక్ష పార్టీలు కూడా గుర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలను గ్రామ స్థాయి నుంచి మొదలుకుని నియోజకవర్గస్థాయి వరకు అందరినీ తమ పార్టీలో చేర్చుకుంటున్నాయి ఇతర పార్టీలు. పాడి కౌశిక్‌రెడ్డి, స్వర్గం రవి ఇతర కీలక నేతలను గులాబీ పార్టీ తమ గూటిలోకి చేర్చుకుంది. స్వయంగా సీఎం కేసీఆర్ వారికి గులాబీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో నేతలు ఉన్నప్పటికీ బలమైన బీసీ నేతల ఎంపిక విషయమై రేవంత్ మధనపడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అందుకే ఓసీ నేతలను పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత మంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లినప్పటికీ ఉన్న నేతల్లో బీసీ కార్డు ద్వారా ఓట్లు పొందేందుకు అనువైన వ్యక్తి ఎవరు? అని ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి ఉండబోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. బీసీ కార్డు అనగా బీసీ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ అభ్యర్థిగా పెట్టాలన్న వ్యూహం ఎలా పని చేయబోతున్నదని తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అయితే, అధికార పార్టీ ఇప్పటికే బీసీ కార్డును ప్రదర్శించుకునేందుకు గాను నేతలను తన వద్దకు తీసుకుంది. జిల్లా నుంచి ఎల్.రమణ‌తో పాటు ఇటీవల పార్టీలో చేరిన స్వర్గం రవి ద్వారా గులాబీ పార్టీ బీసీలకు అండగా నిలుస్తుందనే ప్రచారం చేసేందుకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news