భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 118 చైనా యాప్స్ ని బాన్ చేస్తూ నిర్ణయం వెల్లడించింది. అందులో పబ్ జీ కూడా ఉంది. గత నాలుగు నెలల కాలంగా సరిహద్దుల్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. ఈ క్రమంలోనే పలు యాప్స్ ని కేంద్రం బాన్ చేస్తూ వస్తుంది. తొలి విడతగా 60 వరకు యాప్స్ ని రెడీ చేసిన కేంద్రం ఇప్పుడు 118 యాప్స్ ని బాన్ చేసింది.
భారతదేశం యొక్క సార్వభౌమాధికారం మరియు సమగ్రత విషయంలో ఏ మాత్రం భద్రత లేని 118 మొబైల్ యాప్స్ ని ప్రభుత్వం బ్లాక్ చేస్తుందని… భారత ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ప్లే స్టోర్ సహా యాప్ స్టోర్ లో యాప్ ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 70 కోట్ల మంది పబ్ జీ ని డౌన్ లోడ్ చేసుకున్నారు.