బిగ్ బ్రేకింగ్; చంద్రబాబు సన్నిహితులపై ఐటి దాడులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో ఐటి దాడుల హడావుడి నెలకొంది. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు ఇళ్ళపై ఢిల్లీ ఐటి బృందం ఏకకాలంలో దాడులు చేసింది. పలువురు టీడీపీ సీనియర్ నేతల ఇళ్ళపై ఏకకాలంలో దాడులు జరిగాయి. పలువురు ఇళ్ళపై ఐటి దాడులు చేస్తున్నారు. ప్రధానంగా చంద్రబాబు సన్నిహితుల ఇళ్ళపై ఐటి అధికారులు విరుచుకుపడ్డారు. కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఐటి అధికారులు సోదాలు చేసారు.

ఉదయం నుంచి చంద్రబాబు మాజీ పిఏ శ్రీనివాస్ పై కూడా ఐటి దాడులు జరిగాయి. ఆయన 2019 వరకు చంద్రబాబు పిఏగా ఉన్నారు. డీ నరేష్ చౌదరి ఇళ్ళపై కూడా సోదాలు చేసారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుల ఇళ్లనే టార్గెట్ చేసారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు ప్రత్తిపాటి శరత్ ఇంటిపై కూడా ఐటి అధికారులు సోదాలు చేసారు.

సిఆర్పిఎఫ్ బలగాల పహారాలో అధికారులు సోదాలు చేస్తున్నారు. డిఎన్సీ ఇన్ఫ్రాకు చెందిన నరేష్ ఇంటిపై ఐటి దాడులు చేస్తున్నారు.అదే విధంగా నవయుగ సంస్థ మీద కూడా ఐటి దాడులు జరుగుతున్నాయి. దీనితో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలయింది. ఎప్పుడు ఎం జరుగుతుందో అనే భయం నెలకొంది. అన్ని చోట్లా కూడా ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు ఏకకాలంలో దాడులు చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version