సోషల్ మీడియా వాడే వాళ్ళకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ !

-

ప్రస్తుతం ప్రపంచం మొత్తం మారిపోయింది. ఒకానొక సమయంలో మనుషులు రోడ్డుమీద మాట్లాడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు. అలాగే ఇంట్లో కూడా. అయితే ప్రస్తుతం మొత్తం మనుషులంతా సోషల్ మీడియా కి అలవాటు పడిపోయి పక్కనే ఉన్న మనుషుల తో మాట్లాడడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనిషి బంధాలు మరియు అనుబంధాలు అర్థాలు అంతా మారిపోతున్నాయి. చాలావరకు సోషల్ మీడియాలో లైకులు మరియు మెసేజ్ లు అదేవిధంగా వ్యూస్ ఎవరికి ఎక్కువ వస్తే వారే పాపులర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. Image result for socail mediaఈ క్రమంలో కొంతమంది ఆ స్థాయిలో కి వెళ్లలేని వాళ్ళు జీవితమే కోల్పోయాము అన్నట్టుగా ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా బతకటం తో మనిషి జీవితంలో ఏకాంతం అన్నది లేకుండా పోయింది. అనుక్షణం ఎవరికి వారు.. వారి చేతుల్లోని సెల్ ఫోన్లతో కాలం గడపటం పెరిగిపోయింది. దీనికారణంగా భార్యభర్తల రిలేషన్ లోనే కాదు.. అన్నాచెల్లెలు.. అక్కాచెల్లులు.. స్నేహితులు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రిలేషన్ల మధ్య అర్థం మారిపోయింది.

 

దీంతో అర్థం పర్థం లేని వాతావరణంలో అనారోగ్య వాతావరణం అదేవిధంగా అక్రమ సంబంధాలు పెరిగిపోవడంతో చాలా కుటుంబాలు కూలిపోతున్నాయి. ఎక్కువగా సోషల్ మీడియాలో ఇతరులను చూసి తామూ అలాగే చెయ్యాలని వ్యవహరించే వాళ్లకు మాత్రం ప్రస్తుత జీవితాన్ని ఆస్వాదించే పరిస్థితి లేదని చాలా మంది నిపుణులు అంటున్నారు. కేవలం సమాచారం మేరకు సోషల్ మీడియా ని వాడితే బాగుంటుందని…సెల్ఫ్ ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తే మన కొంప ముంచుతుంది అంటూ జాగ్రత్తలు సూచనలు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news