BIG BREAKING: అన్ స్టాపబుల్ బాలయ్య షోకు మంత్రి కేటీఆర్ ?

-

నందమూరి బాలకృష్ణ ఇప్పటికే సినిమాల ద్వారా తాను ఎంత గొప్ప నటుడో నిరూపించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి హిందుపూర్ ఎమ్మెల్యేగా కొంతకాలంగా ప్రజాసేవలో ఉన్నారు. ఈ రెండు పాత్రలే కాకుండా కొంతకాలంగా యాంకర్ గా కూడా ఓ ప్రోగ్రాం ను హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆహ అనే ఒక ఓటిటి ప్లాట్ ఫామ్ లో “అన్ స్టాపబుల్” అనే షో ను చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ షో లో రెండు సీజన్ లు పూర్తి అయ్యాయి. మొదటి సీజన్ లో నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు గెస్ట్ లుగా రాగా, రెండవ సీజన్ లో పవన్ కళ్యాణ్ అతిధిగా వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం త్వరలోనే మూడవ సీజన్ ఉండనుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి తెలంగాణ మంత్రిగా పని చేస్తున్న కేటీఆర్ అతిధిగా రానున్నారు అంటూ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

కానీ ఎప్పుడు ఈ సీజన్ 3 ఉంటుంది అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదట. బాలయ్య చాలా బిజీ గా ఉండడం వలన ఆయన డేట్స్ ను అడ్జస్ట్ చేసుకున్న తర్వాతనే ఈ సీజన్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news