టాలీవుడ్‌కు బిగ్ షాక్..రాష్ట్రంలో ఇకపై నో బెనిఫిట్ షోస్

-

టాలీవుడ్‌కు బిగ్ షాక్ తలిగింది. తెలంగాణలో ఇకమీదట బెనిఫిట్ షోస్‌కు అనుమతులు ఇవ్వబోమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టంచేశారు.పుష్ప-2 సినిమా కోసం రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతినివ్వగా.. బుధవారం రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్లలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షో వేశారు.

ఆ టైంలో అనుకోకుండా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో సహా సినిమా చూసేందుకు సంధ్య థియేటర్కు వచ్చాడని విషయం తెలిసి ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా, ఆమె కొడుకు ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద ఘటన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news