పొట్ట పెరిగినప్పుడు శరీరాకృతి వికృతంగా కనిపిస్తుంది. రోజూ అద్దంలో చూసుకుంటూ ఎలాగైనా పొట్ట తగ్గించాలని దాదాపు ప్రతీ ఒక్కరు అనుకుంటారు. బట్.. రకరకాల కారణాల వల్ల అది సాధ్యం కాదు. అలాంటి వాళ్లలో మీరు కూడా ఒకరైతే.. ప్రస్తుతం పొట్టను తగ్గించుకునేందుకు లైఫ్ స్టైల్ లో చేసుకోవాల్సిన మార్పుల గురించి తెలుసుకుందాం.
ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. పొట్ట తగ్గించడం అనేది చిన్న ప్రాసెస్ కాదు. స్విచ్ వేస్తే బల్బ్ వచ్చినట్టు 10 రోజుల్లో 15 రోజుల్లో పొట్ట తగ్గదు. కచ్చితంగా టైం తీసుకుంటుంది.
డైట్:
పొట్ట తగ్గించాలి అనుకున్నప్పుడు డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉన్న స్నాక్స్, రిఫైన్ చేసిన ఆహార పదార్థాలైన వైట్ బ్రెడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. వాటి స్థానంలో మంచి కొవ్వులు కలిగిన అవకాడో తీసుకోవాలి. గింజలు, గుడ్లు, ఆకుకూరలు వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
సుఖ నిద్ర:
నిద్రకు, శరీర బరువుకు సంబంధం ఉంది. మీరు సరిగ్గా నిద్ర పోకపోతే శరీరంలో హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఈ కారణంగా మీరు బరువు పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలంటే హాయిగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోండి.
కావలసినన్ని నీళ్లు:
ఒక రోజులో రెండు నుంచి మూడు లీటర్ల నీటిని కచ్చితంగా తాగాలి. హార్డ్ వర్క్ చేసి చెమట చిందించే వాళ్లు అంతకన్నా ఎక్కువ తాగాల్సి ఉంటుంది. కావలసినన్ని నీళ్లు తాగడం వల్ల శరీర జీవక్రియ సరిగ్గా ఉంటుంది. దానివల్ల మీరు బరువు పెరగరు.
ఒత్తిడి అసలే వద్దు:
లేనిపోనివన్నీ మనసులోకి ఎక్కించుకుని వాటి గురించి గంటలు గంటలు ఆలోచిస్తూ ఒత్తిడికి లోను కాకండి. ఒత్తిడి కారణంగా కొంతమంది ఎక్కువగా తింటారు. దాంతో బరువు పెరిగిపోతారు. ఏం జరిగినా మంచికే అనుకుని ప్రశాంతంగా ఉండండి.
వ్యాయామం:
శరీరాన్ని ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంచుకోండి. రోజులో కనీసం 30 నుండి 40 నిమిషాల పాటు వ్యాయామం కచ్చితంగా చేయండి. ముఖ్యంగా పొట్టను తగ్గించే ఎక్సర్సైజెస్ మీద దృష్టి పెట్టండి.