IND Vs AFG: ఇండియా తో T20.. ఆఫ్గనిస్తాన్ కి పెద్ద షాక్..!

-

భారత్ ఆఫ్గనిస్తాన్ జట్ల మధ్య టి20 సిరీస్ గురువారం మొదలు కానుంది. ఈ మ్యాచ్ ల కోసం ఇప్పటికే ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు ఆటగాళ్లు. ఈ క్రమంలో ఆఫ్గనిస్తాన్ కి బిగ్ షాక్ అయితే తగిలింది. లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ T20 సిరీస్ కి దూరమయ్యారు వెన్నునొప్పి కారణంగా రషీద్ T20 నుండి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం చెప్పారు. వన్డే ప్రపంచ కప్ 2023 తర్వాత రషీద్ ఖాన్ క్రికెట్ ఆడలేదు.

మెగా టోర్నీ ముగిసిన వెంటనే వెన్నునొప్పికి సర్జరీ చేయించుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో టి20 సిరీస్ కి దూరమయ్యారు తర్వాత అడిలైట్ స్ట్రైక్ తరఫున బిగ్ బాష్ లీగ్ కి కూడా దూరమయ్యారు. భారత పర్యటన దృష్టిలో పెట్టుకొని రషీద్ ని జట్టు లోకి తీసుకున్న గాయం నుండి కోలుకోలేదు దాంతో టీం ఇండియాతో సిరీస్ నుండి అతను తప్పుకున్నాడని ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version