ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో వెనకపడింది: మినిస్టర్ సీతక్క

-

రాజేశ్వర గార్డెన్స్ లో అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశం సీతక్క పాల్గొనడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుందని అభివృద్ధిలో మాత్రం వెనుకబడిందని అన్నారు. ఉమ్మడిదలాబాద్ కి నన్ను ఇన్చార్జిగా నియమించడం నా అదృష్టం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ మీద ఎంతో ప్రేమ ఉందని సీఎం అయిన తర్వాత పర్యటన సైతం ఇక్కడ నుండే మొదలు పెడతారని అన్నారు. హైదరాబాద్లో అధికారంతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఈ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి అన్నారు. ఓడిన అభ్యర్థులు సైతం ప్రజల్లో ఉండి కష్టాలు సుఖాలు తీర్చేందుకు ముందు ఉండాలని సీతక్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కల్పిస్తే ఆటో సంఘాలతో ఆందోళన చేయించిన ఘనత బిఆర్ఎస్ పార్టీది అన్నారు అధికారంలోకి వచ్చిన రెండు రోజుల నుండే కాంగ్రెస్ ప్రభుత్వం పై బిఆర్ఎస్ దూషించడం మొదలుపెట్టిందన్నారు సీతక్క.

Read more RELATED
Recommended to you

Exit mobile version