స్వలింగ సంపర్కం వివాహంపై కేంద్రానికి చుక్కదురు

-

స్వలింగ సంపర్కుల వివాహాన్ని ప్రత్యేక వివాహ చట్టం కింద చట్టబద్ధంగా గుర్తించాలని కోరుతూ స్వలింగ సంపర్కుల పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇవాళ హైదరాబాద్ కు చెందిన స్వలింగ సంపర్కుల జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారణ జరిపింది. తమకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే హక్కు LGBTQ+ పౌరులకు కూడా వర్తిస్తుందని పిటీషన్ లో పేర్కొన్నారు హైదరాబాద్‌లో నివసిస్తున్న ఇద్దరు స్వలింగ సంపర్కులు సుప్రియో చక్రవర్తి మరియు అభయ్ డాంగ్.

 

10 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో కలసి నివసిస్తున్నారు ఇద్దరు స్వలింగ సంపర్కులు సుప్రియో చక్రవర్తి , అభయ్ డాంగ్. గత సంవత్సరం డిసెంబరు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు , స్నేహితుల సమక్షంలో 9వ వార్షికోత్సవం జరుపుకుంది జంట. ఇక స్వలింగసంపర్కుల జంట తరపు ఈ పిటిషన్‌ వేసింది న్యాయవాదులు అరుంధతీ కట్జూ, ప్రియా పూరి , సృష్టి బోర్తకూర్. ఈ నేపథ్యంలోనే నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version