అవును! రాష్ట్రంలో సోషల్ మీడియా పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ప్రజల అభిప్రాయాలకు, కీలక స మాచార సాధనానికి పట్టుకొమ్మగా ఉండాల్సిన సోషల్ మీడియాలో ఓ పార్టీ వైఖరితో ఇప్పుడు బ్రష్టు పడు తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ సోషల్ మీడియాను విస్తృతంగా వినియో గించింది. ప్రభుత్వ పథకాలను, పార్టీ కార్యక్రమాలను కూడా సోషల్ మీడియనే వినియోగించుకు నే ప్రజల్లోకి తీసుకువెళ్లేది. నిజానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల కంటే కూడా టీడీపీ బారీ ఎత్తున సోషల్ మీ డియాను వినియోగించుకునేది.
అయితే, ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఇదే తీరుగా సోషల్ మీడియాను వినియోగిస్తోంది. ఇది మం చిదే.. ప్రజలకు తమ అభిప్రాయాలను చేరవేసేందుకు ఉపయోగపడేలా సోషల్ మీడియా ఉంటే అంతక న్నా కావాల్సింది ఏమి ఉంటుంది. అయితే, ఈ విషయంలో టీడీపీ సోషల్ మీడియా విభాగం దూకుడు పెం చింది. ఉన్నవీ లేనివీ కూడా ప్రచారం చేసేందుకు రెడీఅయింది. ప్రస్తుతం రాజధాని రైతులకు అనుకూ లంగా టీడీపీ భారీ ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.
ఈ క్రమంలో ఎక్కడో ఏదో రాష్ట్రంలో ట్రాన్స్‌ఫార్మర్ ఎక్కి నిరసన తెలిపిన వ్యక్తుల ఫొటోలను కూడా అమరావతిలో రైతులకు అంటగడుతూ చేస్తున్న ప్రచారాలు వికటిస్తున్నాయి. అదేసమయంలో గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఒక విషయంలో చేసిన ఆందోళనను జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటగడుతూ.. టీడీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారం తీవ్ర వివాదానికి దారితీసింది. కేంద్రం తీసుకువచ్చిన ఎన్నార్సీ బిల్లుకు వ్యతిరేకంగా నాగార్జున నోటికి బ్లాక్ రిబ్బన్ కట్టుకుని ఆందోళన చేశారు. అయితే, ఈ ఫొటోను టీడీపీ సోషల్ మీడియా తనకు అనుకూలంగా మార్చుకుంది.
జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అమ్మ ఒడి కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వినియోగించడాన్ని వ్యతిరేకిస్తున్నానంటూ.. మేరుగ ఫొటోకు క్యాప్షన్‌గా పెట్టి ప్రచారం చేయడం తీవ్ర వివాదానికి కారణమైంది. అదేసమయంలో మహిళలను పోలీసులు తోసివేస్తున్నారని, వారిని నెట్టేస్తున్నారని అమరావతి ఆందోళనతో సంబంధం లేని ఘటనలను చూపిస్తూ.. ప్రచారం చేయడం టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ఘనకార్యంగా వ్యతిరేక ప్రచారాన్ని మూటగట్టుకోవడం గమనార్హం.