రోడ్డును కమ్మేసిన పొగమంచు.. వీడియో వైరల్

-

తెలంగాణలో టెంపరేచర్ క్రమంగా పడిపోతున్నది. దీంతో ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంటోంది. ఉత్తర తెలంగాణలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.రాత్రుళ్లు చలి విపరీతంగా ఉంటోందని, ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండటంతో అక్కడి ప్రజలు రాత్రుళ్లు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. తీవ్రమైన చలి ధాటికి చలి మంటలు వేసుకుంటున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర తెలంగాణకు చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. దీంతో ఎదురుగా ఏ వాహ‌నాలు వ‌స్తున్నాయో కూడ తెలియ‌కుండా రోడ్డును పూర్తిగా పొగమంచు కమ్మేసింది. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, ఇది ఖచ్చితంగా ఏ ప్రాంతమో తెలియరాలేదు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version