హైకోర్టు నోటీసుల‌తో చిక్కులో జన‌సేన‌ ఎమ్మెల్యే..!

-

జ‌న‌సేన‌కు ఉన్న ఒక్క‌గానొక్క ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌కు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. జ‌నసేన పార్టీ వాయిస్‌ను అసెంబ్లీలో వినిపించే ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఒక్క‌రు. అయితే ఈ ఎమ్మెల్యే ఇప్పుడు చిక్కుల్లో ప‌డ్డారు. ఇప్పుడు హైకోర్టు జ‌న‌సేన ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేయ‌డంతో అస‌లు ఈ ఎమ్మెల్యే ప‌ద‌వి ఉంటుందా.. లేక‌ ఊడుతుందా అనే సందేహం వ్య‌క్తం అవుతుంది. అస‌లు విష‌యంలోకి వెళ్తే.. 2019 ఎన్నికల్లో రాపాక వ‌ర ప్ర‌సాద రావు దొంగ ఓట్లు, రిగ్గింగ్‌కు పాల్ప‌డ్డార‌ని హైకోర్టులో పిటిష‌న్ వేశారు వైసీపీ నేత బొంతు రాజేశ్వ‌ర్‌రావు.

దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుతోపాటు రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేశారు. రాపాక వరప్రసాద్ రావుపై వస్తున్న దొంగ ఓట్లు, రిగ్గింగ్ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది హైకోర్టు. అలాగే జనసేన ఎమ్మెల్యేకు నోటీసులు పంపించారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news