మహాత్మాగాంధీ 150 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విత్ ఇన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, షారుక్ ఖాన్, జాక్విలిన్ ఫెర్నాండెజ్, కంగనా రనౌత్ తో పాటు ఎంతో మంది బాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు వచ్చి సందడి చేశారు. టోటల్‌గా ఈ కార్యక్రమం బాలీవుడ్ సెలబ్రిటీలతో కళకళలాడింది. అయితే మోదీ ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది బాలీవుడ్ ప్రముఖుల పిలవడంతో సౌత్ సినిమా ప్రముఖులను, సినిమా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
అందరికంటే ముందుగా ఈ విషయంలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన మోదీని సోషల్ మీడియా వేదికగా సూటిగా ప్రశ్నించారు. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులతో మోదీనిర్వహించిన ఈ సమావేశానికి దక్షిణాది ప్రముఖులను ఎందుకు ఆహ్వానించలేదని ఆమె ప్రశ్నించారు. ఉపాసన ప్రశ్నకు సౌత్ సినీ ప్రముఖుల నుంచి సపోర్ట్ లభిస్తోంది. మోదీకి రాసిన లేఖలో భారత చిత్ర పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదని… సౌత్ సినిమా పరిశ్రమ కూడా అందులో అంతర్భాగంగా ఉందన్న విషయం గుర్తించాలని పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు ఉపాసనకు సపోర్ట్ గా సీనియర్ నటి ఖుష్బూ కూడా గొంతు కలిపారు. వరుస ట్వీట్లతో మోదీపై విరుచుకుపడ్డారు. సౌత్ నుంచి టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు మాత్రమే ఆహ్వానం అందింది. దిల్ రాజు సైతం జెర్సీ సినిమా రీమేక్‌తో బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్నారు. సౌత్‌లో చిరంజీవి, మోహన్ బాబు, రజినీకాంత్, మోహన్‌లాల్, ముమ్ముట్టి, కమల్‌హాసన్ ఇలా చాలా మంది సీనియర్లు ఉన్నా వారెవ్వరికి మోదీ నుంచి ఆహ్వానం రాకపోవడంతో సినిమా ప్రముఖులు మోదీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.