షకీల్ కు బ్యాంకు నోటీసులు… రూ. 19 కోట్లు అంటూ

-

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే తన కొడుకు చేసిన యాక్సిడెంట్ కేసులో సతమతమవుతున్న మాజీ ఎమ్మెల్యే షకీల్ కు ఇప్పుడు తాజాగా.. బ్యాంక్‌ నోటీసులు ఇవ్వడం జరిగింది.. తీసుకున్న రుణం సకాలంలో చెల్లించలేదని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు ఎస్బీఐ నోటీసులు ఇచ్చింది.. రూ.19 కోట్ల బకాయి గడువులోగా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు మాజీ ఎమ్మెల్యే షకీల్ కు నోటీసులు జారీ చేయడం జరిగింది.

Former MLA Shakeel
Shakeel’s son Sahel to Panjagutta Police Station

 

అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నోటీసులపై ఇప్పటివరకు మాజీ ఎమ్మెల్యే షకీల్ నుంచి గాని అలాగే ఆయన అనుచరులు నుంచి… ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు ప్రగతి భవన్ ముందు ఆక్సిడెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయానికి గులాబీ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. ముందుకు తీసుకువెళ్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news