తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో దీప్తి అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ అనుమానస్పద మృతి కోరుట్లలో కలకలం రేపింది. అయితే ఇంట్లో మద్యం సీసాలు, ఉండటం.. మృతురాలి చెల్లెలు చందన మరో యువకుడితో పరార్ అవ్వడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. యువకుడితో కలిసి అక్కను చెల్లె చంపేసి ఇంట్లోంచి పారిపోయినట్టు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అక్క దీప్తిని తాను చంపలేదంటూ.. చందన ఓ ఆడియో మెసెజ్ ని తమ్ముడు సాయికి పంపించింది. ఇద్దరం కలిసి మందు తాగుదామనుకుని మద్యం తెచ్చుకున్నాం. కానీ మందు అక్కనే తీసుకుందని.. మందు ఎక్కువగా తీసుకొని పడుకుందని చెప్పింది చందన. అక్కను తాను చంపలేదంటూ.. మెసెజ్ లో తెలిపింది చందన. ఆడియో మెసెజ్ లో ఆ రాత్రి ఏం జరిగిందో వివరించింది. దీప్తి సిస్టర్ చందన ఆడియో మెసెజ్ పంపితే మరీ దీప్తి ఎలా చనిపోయిందనే అనుమానాలకు కారణం మాత్రం క్లారిటీ రావడం లేదు.