వరుణ్ తేజ్ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. !

-

గని సినిమా తర్వాత తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్ తో తెరకెక్కిస్తారు అనే సందేహం అభిమానులలో ఎక్కువగా ఉండేది. కానీ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఒక సినిమా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాదు ప్రస్తుతానికి #VT 12 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు కూడా .. గరుడవేగ చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్న ప్రవీణ్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇదిలా ఉండగా సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా సినిమా నుంచి ఎటువంటి అప్డేట్ చిత్ర యూనిట్ ఇవ్వలేదు.

తాజాగా గురువారం వరుణ్ తేజ్ పుట్టినరోజు పురస్కరించుకొని.. చిత్ర యూనిట్ టైటిల్ తో పాటు వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది. వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు..” గాండీవధారి అర్జున” అనే టైటిల్ ను ఖరారు చేశారు.. లండన్ బ్రిడ్జిపై యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో పూర్తిగా కొత్త లుక్ లో కనిపిస్తున్నారు వరుణ్ తేజ్. గూడచారి పాత్రలో వరుణ్ తేజ్ కనిపించనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలోనే విడుదలైన పోస్టర్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది.

మరోపక్క గాండీవధారి అర్జున అనే టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉంది. మహాభారతంలో అర్జునుడి పేరును టైటిల్ గా ఖరారు చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అంశంగా చెప్పవచ్చు. ఇందులో వినయ్ రాయ్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ లండన్ లో పూర్తి చేసుకున్న ఈ సినిమా.. మిగతా 20% యూరప్ లో ఇతర దేశాల్లో ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version