అయోమయంలోంచి వచ్చిన టీ బ్యాగ్‌.. సృష్టికర్త కష్టాన్ని ఎవరూ గుర్తించలేదే..!!

-

కప్పు చాయ్‌..తలనొప్పి నుంచి మూడ్‌ స్వింగ్స్‌ వరకూ అన్నీ సెట్‌ చేస్తుంది.. చాయ్‌ చరిత్ర ఈనాటిది కాదు.. అయితే చాలామందికి టీ బ్యాగ్స్‌తో చాయ్‌ తాగడం అలవాటు..బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ బ్యాగ్‌ల నుంచి మాములు టీ కూడా బ్యాగ్స్‌లోనే వస్తుంది. రెండు నిమిషాల్లో మ్యాగి అవ్వదేమో కానీ.. రెండు నిమిషాల్లో ఈ టీ బ్యాగ్‌తో వేడి వేడి టీ మాత్రం చేసుకోవచ్చు.. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. ఈ టీ బ్యాగ్స్‌ను ఎవరు కనిపెట్టి ఉంటారో. వాటితో మాకేంపని..షాపులో ఉందా తెచ్చుకున్నామా తాగామా.. అంతే కదా..! కానీ ఈరోజు ఇలా ఫేమస్‌ అవుతున్నవన్నీ అవి కనిపెట్టిన రోజు వాటికి ఎంతోకొంత చరిత్ర ఉంటుంది.. ఎన్నో ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన ప్రయత్నాలు ఇవి.. వంటలు కూడా అంతే..ఒక ఎక్స్‌పైర్‌మెంట్‌ చేసినవే..! టీ బ్యాగ్స్‌ ఎలా కనిపెట్టారు..అసలు ఎవరు సృష్టించారో జర చూద్దామా..!
1900 సంవత్సరం ప్రారంభంలో టీ బ్యాగులు వాడకం మొదలైంది. వాటిని అదే సంవత్సరం న్యూయార్క్ నగరంలో కనుగొన్నారు. థామస్ సుల్లివన్ అనే వ్యక్తి ఒక టీ వ్యాపారి కొడుకు. అతను తన తండ్రి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నాడు..తన టీ ఎంత రుచికరంగా ఉంటుందో, ఆ నమూనాలను అందరికీ పంపించాలని అనుకున్నాడు. అప్పట్లో టీ అనేది లగ్జరీ ఐటమ్.. ఎక్కువ డబ్బులకే అమ్మేవారు. కాబట్టి నమూనాలు పంపించేటప్పుడు, అది కూడా ఉచితంగా పంపించేటప్పుడు తక్కువ పరిమాణంలోని పంపించాలి. లేకుంటే వ్యాపారం దెబ్బతింటుంది..

ఖర్చు కట్‌ చేయడానికే..

కాబట్టి థామస్‌కు ఖర్చును తగ్గించడానికి ఒక ఐడియా వచ్చింది.. ఒకరికి మాత్రమే సరిపోయేటట్టు కొంచెం టీ పొడిని చిన్న పట్టు పౌచుల్లో వేసి, ప్యాక్ చేసి వినియోగదారులకు పంపించాడు. ఆ పౌచులను అందుకున్న వినియోగదారులు వాటిని ఎలా వాడాలో తెలియక అయోమయానికి గురయారు.. కప్పు వేడి నీటిలో ఆ పౌచ్ ని వేసేసారు…ఆశ్చర్యకరంగా చక్కగా టీ తయారైపోయింది. దీంతో ఆయనకు మరిన్ని అలాంటి టీ పౌచులు కావాలంటూ ఆర్డర్లు వచ్చాయట…దీంతో థామస్ తొలిసారిగా టీ బ్యాగులను విక్రయించడం ప్రారంభించాడు.
అనదికాలంలో అది అతి పెద్ద వ్యాపారంగా మారిపోయింది. కనిపెట్టిన వ్యక్ థామస్ అయినప్పటికీ ఆ ఉత్పత్తికి పేటెంట్ మాత్రం పొందలేకపోయాడు. కాలక్రమంగా టీ బ్యాగులు చాలా ముఖ్యమైన వాటిగా మారిపోయాయి. అంతేకాదు వాటికి వాడే ఫ్యాబ్రికులు కూడా మారుతూ వచ్చాయి. ప్రస్తుతం పలుచని కాగితాన్ని టీ బ్యాగులకు ఉపయోగిస్తున్నారు. టీ బ్యాగులపై పేటెంట్ ఇద్దరు మహిళలు పొందారు. కష్టపడిన థామస్ మాత్రం చరిత్రలో మిగిలి పోయాడంటే.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో టీ సంస్థలు ఉన్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version