బిగ్ బాస్ 4 ఎపిసోడ్ 6 : అతడినే పెళ్లి చేసుకుంటానన్న మోనాల్.. కట్టప్ప ఆ యాంకరేనా?

-

మొదటి నాలుగు రోజులు చప్పగా సాగిన బిగ్ బాస్ షో ఐదో రోజు నుంచి ఊపందుకుంది. బిగ్ బాస్ ఇచ్చిన ఫిజికల్ టాస్క్ వల్ల ఆరో రోజు కూడా ప్రేక్షకులకు కావాల్సిన వినోదం దొరికింది. బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఫిజికల్ టాస్క్ ను పూర్తి చేయాలని ప్రయత్నించినా వాళ్ల వల్ల కాలేదు. టాస్క్ పూర్తి చేయకపోవడంపై బిగ్ బాస్ స్పందిస్తూ కట్టప్ప వల్లే టాస్క్ పూర్తి చేయలేకపోయారని కంటెస్టెంట్లకు ట్విస్ట్ ఇచ్చాడు.

హౌస్ లో కట్టప్ప గోల కొనసాగుతుండగా గంగవ్వ వర్కౌట్ లు, పంచ్ డైలాగులు ఎపిసోడ్ కు హైలెట్ గా నిలిచాయి. మోనాల్ కిచెన్ ను శుభ్రంగా ఉంచాలని అమ్మ రాజశేఖర్ కు చెప్పగా ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. తాను వంట చేస్తున్నానని వంట చేసే వ్యక్తి కిచెన్ ను క్లీన్ చేయడం ఎలా సాధ్యమవుతుందని అమ్మ రాజశేఖర్ ప్రశ్నించాడు. రాజశేఖర్ సమాధానం నచ్చని కరాటే కల్యాణి తాను ఉపవాసం ఉంటానని చెప్పింది.

రాజశేఖర్ దివితో పులిహోర కలుపుతూ నూనెలో టీ పొడి వేశాడు. దీంతో బిగ్ బాస్ సభ్యులందరూ నవ్వారు. ఆ తర్వాత మోనాల్ అఖిల్ తో మాట్లాడుతూ తాను పెద్దలు కుదిర్చిన వివాహమే చేసుకుంటానని… ప్రస్తుతం ఎలాంటి రిలేషన్ షిప్ లో లేనని చెప్పింది. మరోవైపు బిగ్ బాస్ మరోసారి కట్టప్ప ఎవరో చెప్పాలంటూ అందుకు కారణం చెప్పాలంటూ సూచించాడు. ఇంటి సభ్యుల్లో ఆరుగురు నోయల్ కు స్టాంప్ వేసి అతనే కట్టప్ప అని చెప్పగా నలుగురు లాస్యకు స్టాంప్ వేసి ఆమే కట్టప్ప అని చెప్పారు.

నోయల్ తనపై తానే స్టాంప్ వేసుకుంటానని చెప్పగా బిగ్ బాస్ అందుకు అంగీకరించకపోవడంతో అమ్మ రాజశేఖర్ పై స్టాంప్ వేశాడు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో కొత్తగా యాంకర్ లాస్యనే కట్టప్ప అని అనుమానాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అనంతరం బిగ్ బాస్ త్వరలోనే కట్టప్ప ఎవరో చెబుతానంటూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news