మాటల్లో కాదు.. చేతల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పాటు : మంత్రి శ్రీధర్ బాబు

-

పోలీస్ వ్యవస్థను జనరలైజ్ చేయడం సరికాదు అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. మాటల్లో కాదు.. చేతల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించాం. ట్రాఫిక్ మేనేజ్ మెంట్ మెరుగుపరుస్తున్నాం. హోం గార్డులు, కానిస్టేబుల్స్, nss వాలంటీర్స్ 3,300 మందిని నియమించడం జరిగిందని తెలిపారు. బాధితులను బయటపెట్టారు కాబట్టి అప్పుడు కేసులు నమోదు కాలేదు. డ్రగ్స్ ని అరికట్టేందుకు 4 నార్కోటిక్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. హోంగార్డుల సిస్టమ్ తీసుకొచ్చింది మేమే అని.. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నా బాధ్యత లేకుండా చేశారని పేర్కొన్నారు.

డ్రగ్స్ ని అరికట్టేందుకు టీజీ న్యాబ్ ని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ శాఖకు సంబంధించి 232.51 కోట్లు మంజూరు చేసామని.. 31 ప్రదేశాల్లో పనులు కూడా ప్రారంభం కావడం జరిగిందని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ 69 వాహనాలు, మొబిలిటీ కార్యచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. ఆర్థిక నేరాలను అదుపు చేయడానికి సైబరాబాద్ లో పోలీస్ కమిషనరేట్ ని కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news