గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ల విషయంలో ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ముక్కూ మొహం తెలియని వారిని తీసుకొచ్చి సెలబ్రిటీలని చెబుతున్నారని వీక్షకుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దానికి తోడు సోమవారం నుంచి బుధవారం వరకు జరిగిన ఎపిసోడ్లు సైతం పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ టాస్క్ ఇవ్వడంతో షోపై వీక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
బిగ్ బాస్ హౌస్ లో సైలెంట్ గా ఉన్న దివి టాస్క్ లో భాగంగా అందరి మొహం మీద ఉన్నదున్నట్టు చెప్పేసింది. దివి గంగవ్వకు ఇంటి సభ్యులు ఏడిస్తే కన్నీళ్లు పెట్టుకోవద్దని, హారిక అందరినీ నువ్వు అని పిలుస్తుందని అలా కాకుండా రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుందని, అభిజిత్ కోపం తగ్గించుకోవాలని, లాస్య సెన్సిటివ్ అని, మోనాల్ ప్రతి విషయానికి ఏడుస్తోందని అది మంచి పద్ధతి కాదని, దేవీ నాగవల్లి ఎప్పుడూ ఒకే ఎనర్జీ మెయింటైన్ చేస్తే బాగుంటుందని సూచించారు.
సూర్యకిరణ్ తన మాటనే వినాలి అనడం తగ్గించాలని, అమ్మ రాజశేఖర్ కుళ్లు జోకులు ఆపేస్తే మంచిదని, అఖిల్ మోడల్ అని చెప్పింది. అనంతరం బిగ్ బాస్ అరియానా, సోహైల్‌ను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి ఇంటి సభ్యులు ఎవరిని కట్టప్ప అనుకుంటున్నారో కనుక్కోవాలని సూచించారు. అయితే సొహైల్ ఆ విషయం ఇంటి సభ్యులకు చెప్పగా ఇప్పటికే కట్టప్ప ఎవరో చెప్పేశామని… మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదని ఇంటి సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత సూర్యకిరణ్, గంగవ్వ అఖిల్ పేరును, దివి, మెహబూబ్ లాస్య పేరును, నోయల్ అమ్మ రాజశేఖర్ పేరును చెప్పారు. దేవి ఇంట్లో కట్టప్ప లేడని చెప్పగా మిగతా ఇంటి సభ్యులు మాత్రం తమ అభిప్రాయాలను చెప్పలేదు. మరోవైపు బిగ్ బాస్ హౌస్ లో తొలి ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు. ఒక్కో టీంలో ముగ్గురు ఉండేలా క్వాలిటీ టీంను ఏర్పాటు చేసి అరియానా, సొహైల్ ను క్వాలిటీ చెక్ అధికారులుగా గంగవ్వను సహాయకురాలిగా, సూర్యకిరణ్ ను సంచాలకుడిగా నియమించారు. టమాటాలను పల్పీలుగా చేసి బాటిళ్లలో నింపడం టాస్క్. మరోవైపు కట్టప్ప తానేనని నోయల్ చెప్పడం గమనార్హం. నిజంగా కట్టప్ప నోయల్ అవునో కాదో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.