ఏపీలో మరో రాజకీయ రగడ రాజుకుంది. టీటీడీ పరిపాలన భవన్ వద్ద స్వామీజీలు ఆమరణ దీక్షకు దిగారు. వారాహి డిక్లరేషన్ అని ప్రకటించిన పవన్ కళ్యాణ్ పై వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని సాధు పరిషత్ ఈ సందర్బంగా డిమాండ్ చేసింది.
అలిపిరికి సమీపంలో ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఎలా అనుమతులు ఇస్తారని, దానిని వ్యతిరేకిస్తూ సాధువులు బుధవారం తెల్లవారు జాము నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఎదుట ఆమరణ దీక్షకు దిగారు. దీనిని వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లేనియెడల దీక్షను తీవ్రతరం చేస్తామని సాధువులు హెచ్చరిస్తున్నారు. అన్యమతస్తులకు శ్రీవారి ఆలయం సమీపంలో ఎటువంటి వ్యాపారాలకు అనుమతి ఇవ్వకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.