BIGG BOSS-5 : చెంప పగిలింది..ప్రియ పచ్చడయ్యింది..!

-

బిగ్ బాస్ తెలుగు సీజన్- 5 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు సభ్యులు ఇంటి నుండి వెళ్ళిపోగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి నటి శైలజ ప్రియ ఎలిమినేట్ అయినట్టు లీక్ అయింది. ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్ లో యాంకర్ రవి, శ్రీరామచంద్ర, లోబో ,సిరి హనుమంతు, ప్రియా, యానీ మాస్టర్ ఎలిమినేషన్ లో ఉన్నారు. అయితే వీరిలో యానీ మాస్టర్ మరియు నటి ప్రియ కు తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొదట యాని మాస్టర్ ఎలిమినేట్ అవుతుందని అంతా అంచనా వేయగా చివరికి ప్రియా హౌస్ నుండి ఎలిమినేట్ అయినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రియా బిగ్ బాస్ షో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇప్పటివరకు బిగ్ బాస్ లోకి వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు మొదటి వారంలోనే ఎలిమినేట్ అవ్వడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రియా మాత్రం వారిలా కాకుండా కొన్ని వారాల పాటు ప్రేక్షకులను అలరించింది. అంతేకాకుండా ప్రియాకు ఎంతోమంది అభిమానులు అయ్యారు. అయితే రీసెంట్ ఎపిసోడ్ లో విజే సన్నీ తో ప్రియకు గొడవలు జరిగాయి. ఆ గొడవల ఎఫెక్ట్ కారణంగానే ఈ వారం ప్రియ ఎలిమినేట్ అయినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version