BIGG BOSS-5 : హౌస్ లో ఆడొక్కడే మొగోడు..ఇచ్చిపడేసిన సరయు..!

-

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన వాళ్ళు బిగ్ బాస్ బజ్ లో మొదట ఇంటర్వ్యూ ఇవ్వడం సాధారణం. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ -5 లోనూ అదే ఆనవాయితీ కొనసాగుతోంది. నిన్న బిగ్ బాస్ ఇంటి ఎలిమినేట్ అయ్యి బయటకు నుండి బయటకు వచ్చిన సరయు బిగ్ బస్ బజ్ లో దర్శనం ఇచ్చింది. ఇక ఈ ప్రోమో లో సరయు రెచ్చిపోయింది. బిగ్ బాస్ బజ్ లో యాంకర్ గా గత సీజన్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ సరయు ను ఇంటర్వ్యూ చేసింది.ఇక దీనికి సంబంధించిన ప్రోమో విడుదలవగా సరయు షాకింగ్ కామెంట్స్ చేసింది.

యాంకర్ రవి చెప్పేది ఒకటి చేసేది ఒకటని సరయు చెప్పింది. ఇక సన్నీ వేస్ట్ అని తేల్చి పడేసింది. ఇంట్లో సిరి షణ్ముక్ ముందుగా ప్లాన్ చేసుకుని వచ్చి గేమ్ ఆడుతున్నారని తెలిపింది. మగాళ్ళ ను చూసుకుని గేమ్ ఆడకుడదు అంటు చెప్పింది. అంతే కాకుండా బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కడే మగాడు ఉన్నాడని అది విశ్వ అని సరయు చెప్పుకొచ్చింది. ఇక సరయు మాట్లాడుతున్నప్పుడు అరియానా అసలు నోరు కూడా ఎత్తకుండా సైలెంట్ గా ఉండిపోయింది. ప్రోమో నే ఈ రేంజ్ లో ఉంటే ఇక ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version