తెలంగాణ, ఏపీ ప్రజలకు అలర్ట్.. 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందట. తెలుగు రాష్ట్రాల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న గరిష్టంగా 35-37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి.
మరోవైపు, ఏపీలో సాధారణం కంటే ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 36.4 డిగ్రీలుగా నమోదు అయింది. వాస్తవానికి మార్చి మొదటి వారంలో ఎండలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి చివరి వరకు చలి అలాగే ఉంటుంది. శివరాత్రి తరువాత.. ఎండలు ప్రారంభమయ్యే చాన్సులు ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో… ఫిబ్రవరి మొదటి వారంలోని ఎండలు ప్రారంభమవుతున్నాయి. అలా జూలై వరకు ఎండలు కొనసాగుతున్నాయి. ఈసారి కూడా అదే పరిస్థితి నెలకొంది.