Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్-5 మంచి రసవత్తరంగా కొనసాగుతోంది. కింగ్ నాగార్జున తన ఎనర్జిటిక్ హోస్టింగ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. టైటిల్ రేసులో నువ్వా నేనా అన్నట్లు కంటెస్టెంట్లందరూ పోటీ పడి రెచ్చిపోతున్నారు. ఇక ఈ షో వీక్ స్టార్టింగ్‌లో నామినేషన్స్, వీకెండ్లో ఎలిమినేషన్లు ‘బిగ్ బాస్’ షోకు హైలెట్ గా నిలుస్తున్నాయి. అయితే.. రియాలిటీ షోలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇందులో ఏకంగా పది మంది సభ్యులు నామినేటయ్యారు.
ఇందులో పెర్ఫామెన్స్, పాపులారిటీ పరంగా చూస్తే.. షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, సన్నీలు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. కొన్ని కంత్రీ వేషాలు వేసి.. రవి తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసుకుని పరువు పోగొట్టుకుంటున్నాడు.. అయితే.. ఈ వారం మాత్రం తన టాస్క్‌లలో ఫుల్ ఎఫర్ట్ పెట్టి బేష్ అయిపించారు.
తాజాగా ప్రముఖ న్యూ వెబ్ సైట్ నిర్వహించిన సర్వే ప్రకారం.. గత వారంలో లాగానే.. ఈ వారం కూడా షణ్ముఖ్ జస్వంత్ అధిక (30%) ఓట్లు సాధించి.. టైటిల్ ఫేవరెట్ గా టాప్‌లో నిలిచారు. ఇక, రెండు మూడు స్థానాల్లో వీజే సన్నీ, మిస్టర్ కూల్ శ్రీరామ చంద్ర పోటీ పడుతున్నారు. ఇక టైటిల్ ఫేవరెట్ గా రంగంలోకి దిగిన యాంకర్ రవి ఈ వారం నాలుగో స్థానానికే పరిమితం అయ్యాడట.
ఇక జెస్సీ.. తొలుత అమాయక చక్రవర్తి , స్వాతిముత్యం అని అందరూ భావించినా.. ట్కాస్‌ల్లో బెస్ట్ పర్మామేన్స్ ఇస్తూ.. చాపకింద నీరులా స్ట్రాంగ్ అవుతున్నాడు. ఇక ప్రియాంక.. తను బిగ్ బాస్ కు ఎందుకు వచ్చింది.. అసలు ఇంట్లో ఏం చేస్తుందో ఎవ్వరి అర్థం కావడం లేదు.. పింకీ మానస్ మాయలో పడి గేమ్‌ని గాలికి వదిలేసిందనే చెప్పాలి. కానీ పింకీకి సింపథీ ఓట్లు బాగానే పడుతున్నాయట. దీంతో పింకీ సేఫ్..
ఇక మిగిలింది ముగ్గురే.. వారే శ్వేతా, లోబో, విశ్వ. ఈ ముగ్గురిలో ఒకరికి మూడినట్టే. ఎవరొకరూ ఎలిమినేట్ కావాల్సిందే.. అయితే.. ఈ వారం కెప్టెన్ విశ్వ కాబట్టి సేవ్ అయినట్టే. ఇక మిగిలింది లోబో, శ్వేతా. లోబో విషయానికి వస్తే.. రవి రాముడు అయితే.. లోబో హనుమంతుడు. రవి కోసం ఏదైనా చేసే.. రామబంటు లోబో.. తన కోసం కాకుండా రవి కోసం గేమ్ ఆడుతాడు లోబో. అయితే.. ఆయనకు పుల్ మాస్ ఫాలోయింగ్ ఉంది. ఒకవేళా.. లోబో ఎలిమినేట్ అయితే.. హౌస్ లో కాస్త ఉన్న కామెడీ మూడ్ కూడా పోతుంది.. సో లోబో కూడా సేవ్ అవుతూ వస్తున్నాడు.
ఇక మిగిలింది శ్వేత.. పలు చిత్రాల్లో నటించినా.. ఈమెకు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు.. ఆమె బిగ్ బాస్ వచ్చిన తరువాత కాస్తా గ్రాఫ్ పెరిగింది. కానీ.. ఈ రెండు వారాలుగా ఆమె ఫెర్ఫామెన్స్ పై పలు విమర్శలు వస్తున్నాయి. మొన్న హనీ మాస్టర్ తో విభేదించడం.. నిన్నటి షోలో ప్రియ మీద అనవసరంగా ఫైర్ కావడం ఆమె మైనస్ పాయింట్స్. నామినేషన్స్‌లోకి రాకపోవడం ద్వారా శ్వేతా ఇన్నాళ్లూ బిగ్ బాస్ హౌస్‌లో ఉంది కానీ.. లేదంటే ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సిందే.
గత ఐదు ఎలిమినేషన్లను పరిశీలిస్తే.. ఎవరైతే గొడవలు పెట్టుకుని హౌస్‌లో రచ్చ చేశారో వాళ్లే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. ఇలా చూసినా.. శ్వేతకి ఈవారం ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఆ రకంగా చూస్తే ఆరోవారంలో శ్వేతా ఎలిమినేట్ కావడం ఖాయంగానే కనిపిస్తుంది. అయితే ఎవరిని ఉంచాలి.. ఎవరిని పంపాలి అనేది బిగ్ బాస్ ఇష్టం కాబట్టి.. ఈ వారం చివర వరకూ వేచి చూడాల్సిందే!