ష‌ణు ఫ్యాన్స్ కు సరయు సిరీయ‌స్ వార్నింగ్..! అన్నంత ప‌ని చేస్తుందా మ‌రీ!

బిగ్‌బాస్ 5 తెలుగు రియాలిటీ షో రోజురోజుకీ రసవత్తరంగా మారుతుంది. తొలివారం ప్రారంభంలో చాలా కూల్ గా ఉన్నా.. వారం గ‌డిచేస‌రికి హౌజ్ మొత్తం హీట్ ఎక్కింది. బిగ్ బాస్ పెట్టే టాస్కుల‌కు కంటెస్టెంట్ల మ‌ధ్య అసహనాలు కట్టలు తెచ్చుకుంది. వారి మ‌ధ్య రోజురోజుకీ మాట‌ల యుద్దం మ‌రింత‌ పెరుగుతోంది. ఈ వాడీవేడీ మ‌ధ్య తొలిసారి సరయు హౌజ్‌ నుంచి ఎలిమినేట్ అయింది.

sarayu

కాగా.. హౌస్ నుంచి బయటికి వచ్చిన సరయు.. బిగ్‌బాస్‌, ఆ షో కంటెస్టెంట్స్ ష‌ణ్ముఖ్‌, సన్నీల‌తో రవిల‌ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందులో ప్రధానంగా యూట్యూబ‌ర్, సూర్య వెబ్ సిరీస్ ఫేమ్‌ షణ్ముఖ్ ను టార్గెట్ చేసింది. ష‌ణ్ముఖ్ నువ్వు మగాడివైతే.. స‌రిగా ఆడు. ఆడే ధ‌మ్ము, ధైర్యం లేకుంటే.. హౌస్ లో గాజులు వేసుకొని ఓ మూలాన కూర్చో.. అంటూ త‌న‌దైన స్టైల్ లో ఘాటుగా కామెంట్స్ చేసింది స‌ర‌యు.

ఈ త‌రుణంలో ష‌ణ్ముక్ ఫ్యాన్స్ పై కూడా చాలా సిరియ‌స్ అయ్యింది. త‌న సంచ‌ల‌న మాటాల‌తో
గ‌ట్టి అరుసుకుంది. సోషల్ మీడియాలో త‌నపై అస‌భ్య‌క‌ర కామెంట్లు చేయ‌డం, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట‌. వారికి స‌రయు ఓపెన్ ఛాలెంజ్ విసిరింది.

త‌న‌పై కామెంట్ చేయ‌డం స‌రికాద‌నీ, ముందు సింగరేణి కాలనీలో ఆభం శుభం తెలియ‌ని ఆరేండ్ల‌ పాపను ఓ కామాంధుడు రేప్ చేసి, చంపివేశాడ‌నీ, అలాంటి విష‌యాల‌పై స్పందించండి. అలాంటి విష‌యాల‌పై ఎలా రియాక్ట్ కావాలో తెలియ‌దు కానీ, త‌న‌పై అస‌భ్య‌క‌ర కామెంట్స్ భూతు మాటల‌తో దాడి చేయ‌డం సిగ్గు చేట‌ని ఉతికి ఆరేసింది. తాను కామాంధుడి చేతిలో బ‌లైన‌ చిన్నారి చైత్ర కుటుంబాన్ని ప‌ర‌మ‌ర్శించ‌డానికి వెళ్తున్నాన‌నీ, దమ్ముంటే అక్కడకు వచ్చి, మనుషులుగా ప్ర‌వ‌ర్తించండ‌నీ మీరు చేయగలిగిన సహాయం మీరు చేయండ‌ని ఓపెన్ ఛాలెంజ్ విరిసింది స‌ర‌యు. ఆ త‌రువాత తాను ప్రతి కామెంట్ కి త‌ను స‌మాధానమిస్తాన‌నీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది సరయు.

ష‌ణ్ముఖ్ పై కామెంట్స్ చేశానంటే.. ఆ హౌజ్‌లో ఎంత స‌పర్ అయ్యానో, ఎంతగా భాద‌ప‌డ్డానో ఆలోచించడ‌ని, షన్నుతో త‌న‌కు ఎదురైన సంఘటనలు ఏవి కూడా ప్ర‌సారం కాలేద‌నీ, త‌న‌ని కావాల‌నే ఎలిమినేట్ చేశార‌ని తన ఆవేద‌నను చెప్పుకోచ్చారు స‌ర‌యు.

త‌న‌ను ష‌ణు, ఇత‌ర కంటెస్టెంట్లు ఏవిధంగా టార్చ‌ర్ చేశారో ప్రూఫ్స్ తో బయటపెడతాననీ, బిగ్ బాస్ బండారం కూడా బ‌య‌ట‌పెడుతున్నాని అన్నారు. ఇప్పుడు సరయు దగ్గర ఉన్న ఆధారాలేంటీ? ఈ ఫ్రూప్స్ వ‌ల్ల బిగ్ బాస్ షోలో ఎలాంటి మార్పులు జ‌రుగుతాయి? అస‌లు ఈ ఫ్రూప్స్‌ను నిజంగానే బ‌య‌ట‌పెడుతుందా.. స‌ర‌యు అన్నంత ప‌ని చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.