బ్రేకింగ్‌ : టీటీడీ పాలక మండలి జాబితా విడుదల

టీటీడీ పాలక మండలి జాబితాను కాసేపటి క్రితం ఏపీ సర్కార్‌ విడుదల విడుదల చేసింది. మొత్తం 25 మంది తో టీటీడీ పాలక మండలి జాబితాను చేసింది సర్కార్‌. పాలక మండలి సభ్యులుగా ఏపి నుంచి పోకల అశోక్ కుమార్, మల్లాడి క్రిష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మేల్యేలు కాటసాని, గోర్ల బాబు రావు, మధుసూదన్ యాదవ్ ఉండగా… తెలంగాణ రాష్ట్రం నుంచి రామే శ్వరావు, లక్ష్మి నారాయణ, పార్ద సారధి రెడ్డి, మూరం శెట్టి రాములు, కల్వకుర్తి విద్యా సాగర్ లకు ఛాన్స్ దక్కింది.

ttd

ఇక అటు తమిళ నాడు నుంచి శ్రీనివాసన్, ఎమ్మేల్యే నంద కుమార్, కన్నయ్య లకు ఛాన్స్ దక్కగా .. కర్నాటక నుంచి శశిధర్, ఎమ్యెల్యే విశ్వనాధ్ రెడ్డి ఛాన్స్ కొట్టేసింది. అలాగే మహరాష్ర్ట నుంచి శివసేనా కార్యదర్శి మిలింద్ ను చోటు కల్పించనుంది ఆంధ్ర ప్రదేశ్‌ సర్కార్. ఈ జాబితాలో ఏపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపిక కావడం విశేషం.