Bigg Boss 5: నట‌రాజ్ మాస్టార్‌కు ‘బిగ్ బాస్’ స‌ర్‌ప్రైజ్ ! చిన్నారి అరుపులతో షాకైనా స‌భ్యులు

-

Bigg Boss 5: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత ఎంట‌ర్టైన్మెంట్ ను అందిస్తున్న షో బిగ్‌బాస్ 5. విజ‌య‌వంతంగా మూడవ వారం జ‌రుగుతుంది. శుక్రవారం నాటి షోలో ఫన్నీ మూమెంట్స్, ఎమోషనల్
సీన్స్, అల‌క‌లు, గొడవలతో అల‌రించారు కంటెస్టెంట్స్‌. లగ్జరీ బడ్జెట్ కోసం కంటెస్టెంట్లు చేసే టాస్క్ కేక పుట్టించింది. మ‌రో వైపు నటరాజ్ మాస్టర్ భార్య సీమంతం వేడుక, చిన్నారి కేరింత‌లతో హౌస్ మొత్తం భావోద్వేగానికి లోనైంది. ఇక సందు దొరికిన‌ప్పుడ‌ల్లా.. ప్రేమ పక్షుల రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయారు.


లగ్జరీ బడ్జెట్ కోసం.. ఈ బిగ్ బాస్ అతికిందంటే అదృష్టమే అనే ట్కాస్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో స‌భ్యులంతా.. ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ గేమ్‌లో మానస్ కొట్టిన ఎక్కువ బంతులు కర్టెన్‌కు అంటుకోవడంతో అతనే విజేత‌గా నిలిచాడు. సిరితో.. ష‌న్నుమాట్లాడ‌క‌పోవ‌డంతో అల‌క‌పాన్పు ఏక్కింది.
మ‌రోవైపు.. ల‌వ్ బ‌ర్డ్ .. రొమాన్స్తో రెచ్చిపోతున్నారు. హమీదాకు మానస్ ప్రేమ‌గా గోరుముద్ద‌లు తినిపించారు. ఈ సీన్ చూసి ప్రియాంక జెలసీగా ఫీల్ అయ్యింది.

దాన్ని జైల్లో ఉన్న మానస్ వద్ద పింకీ వెళ్లగక్కేసింది. ఇలాఉంటే.. నటరాజ్‌ మాస్టర్ కు బిగ్ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. తన భార్య సీమంత వీడియోని ఎమోష‌నల్ గురి చేశారు. ఈ పార్ట్ ఎపిసోడ్ కు హైలైట్‌గా నిలిచింది. ముందుగా ఓ చిన్న పాప ఏడుస్తున్నట్టుగా .. ఆడియో పెట్టారు.దీంతో సభ్యులంద‌రూ షాక్ గుర‌య్యారు. వెంట‌నే వారిని సర్‌ప్రైజ్‌ చేశారు బిగ్ బాస్‌.

తొలుత బిగ్ బాస్ .. చిన్న పాప బొమ్మ‌ను పంపించి, ఆ పాపని కంటెస్టెంట్లంద‌రూ ఎంటర్‌టైన్‌ చేయాలని తెలిపారు. బిగ్ బాస్ ఆదేశాల మేర‌కు ఒక్క‌కొక్క‌రూ ఆడిస్తున్నారు. స‌రిగా నటరాజ్‌ మాస్టర్‌ ఆ పాపని తీసుకుని లాలిస్తూ.. నవ్వించే స‌మ‌యంలో నటరాజ్‌ మాస్టర్ భార్య సీమంతం వీడియోని టెలికాస్ట్ అయ్యింది. ఆ వీడియోను చూసిన నటరాజ్‌ మాస్టర్ ఎమోష‌న‌ల్ అయ్యాడు. దీంతో ఆయ‌న‌ను స‌భ్యులంద‌రూ.. ఆయ‌న‌ను ఓదార్చ‌రు.

ఈ సందర్భంగా ఆయన భార్య మాట్లాడుతూ.. కడుపులో ఉన్న బేబీ తనతో డిష్యూం, డిష్యూం అని ఫైట్‌ చేస్తుందని, ఏదైనా సాధించగ‌ల‌రంటూ తొలుత గేమ్ మీద ఫోకస్‌ పెట్టమని ధైర్యం చెప్పింది. తన గురించి ఆలోచించొద్దని, తాను ఆరోగ్యంగానే ఉన్న‌న‌ని తెలిపింది. దీంతో నటరాజ్‌ మాస్టర్ ఇక ఎమోషనలైయి.. చివరకు టీవీ ద‌గ్గ‌ర‌కు వెళ్లి తన భార్య ఫోటోకు ముద్దు పెట్టడం అంద‌రిని ఆకట్టుకుంది. ఈ సీన్ తో హౌస్ ఎమోష‌న్‌తో నిండిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version