యూట్యూబ్ ద్వారా బిగ్ బాస్ రివ్యూలు చేస్తూ తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న ఆదిరెడ్డి ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా హౌస్ లో పాల్గొన్నారు. ఇకపోతే తనదైన ఆటతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఆదిరెడ్డి మూడో వారం జరిగిన అడవిలో ఆట టాస్క్ లో తన ప్రతిభను కనబరిచిన ఆదిరెడ్డిని కంటెస్టెంట్లు కెప్టెన్గా ఎంచుకున్నారు. ఇక తాజాగా ఇతని గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగే కంటెస్టెంట్లు వారి గురించి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇస్తూ.. వారిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే విధంగా బిగ్ బాస్ కార్యక్రమములోకి వెళ్ళకముందే వారు బయట సోషల్ మీడియాలో కొన్ని టీమ్స్ తో ఒప్పందం కుదుర్చుకొని.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు అని సమాచారం కూడా అందుతుంది.
ఇక ఈ క్రమంలోనే ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా సోషల్ మీడియాలో తమను ప్రమోట్ చేయడం కోసం లక్షల్లో ఖర్చు చేస్తూ పబ్లిసిటీ ఇచ్చే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకుంటుంటారు. ఈ క్రమంలోనే.. కామన్ మ్యాన్ క్యాటగిరీ కింద బిగ్ బాస్ రివ్యూయర్ ఆదిరెడ్డి హౌస్ లోకి వెళ్ళిన విషయం తెలిసిందే. తను సోషల్ మీడియా టీమ్స్ తో పబ్లిసిటీ చేయించుకోవడం కోసం భారీగా ఖర్చు పెట్టారని సమాచారం.. ఇక ఈయన బిగ్ బాస్ లో కొనసాగుతుండగా ఆయన కోసం బయట సోషల్ మీడియాలో వర్క్ చేయడం కోసం దాదాపుగా మూడు టీమ్స్ ను ఏర్పాటు చేశారని, ఆ టీమ్స్ కోసం సుమారుగా 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారని సమాచారం.
ఇకపోతే రూ.10 లక్షలు పబ్లిసిటీ కోసం ఖర్చు చేయడంతో ఇది తెలిసిన చాలా మంది నెటిజెన్స్ అవసరమా? కనీసం బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు నువ్వు అంత సంపాదించలేవు కదా.. అంటూ ఆయన పై విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇకపోతే కామన్ మ్యాన్ క్యాటగిరి కింద బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినప్పటికీ సోషల్ మీడియాలో దాదాపు 3,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే దాదాపుగా ఈయన కూడా ఒక సెలబ్రిటీనే అంటూ ఆయన అభిమానులు కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనా హౌస్ లో కొనసాగడానికి పబ్లిసిటీ కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అనవసరమని చెప్పవచ్చు.