వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు.. కిలోల్లో బంగారం సీజ్

-

వడ్డీ వ్యాపారులపై జగిత్యాల పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుస తనిఖీలు చేస్తూ వారిని ఇరకాటంలో పడేస్తున్నారు. అక్రమంగా నిల్వ చేసిన బంగారాన్ని సీజ్ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ సీహెచ్‌.సింధుశర్మ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహించారు. కిలోల్లో బంగారం స్వాధీనం చేసుకున్నారు.

మెట్‌పల్లిలో వడ్డీ వ్యాపారి కట్కం శివ ఇంట్లో 3.448 కిలోల బంగారం, రూ.32.11లక్షల నగదు, బొప్పొజి లక్ష్మణ్‌ ఇంట్లో రూ.24లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 268 ప్రామిసరీపత్రాలు, కుదువపెట్టుకున్న 34 వాహనాల రిజిస్ట్రేషన్ల పత్రాలు, 5 ఇళ్లకు చెందిన డాక్యుమెంట్లు, 10 చెక్కులను గుర్తించారు.

జగిత్యాలలో మూడు, కోరుట్లలో నాలుగు, రాయికల్‌, మెట్‌పల్లిలో రెండేసి ఇళ్లలో, జగిత్యాల మండలంలో ఒక ఇంట్లో తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కేసులు నమోదుచేశారు. జగిత్యాల, మెట్‌పల్లి డీఎస్పీలు ప్రకాశ్‌, రవీందర్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version