బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం చుట్టూ వచ్చిన కొత్త గొడవలన్నీ బిగ్ బాస్ తరహా డ్రామాగా మార్చాయని… నటుడు కుముద్ మిశ్రా అన్నారు. ఇప్పటి వరకు అతని మరణంపై అనేక అనుమానాలు వచ్చాయని… ఇంట్లో వాళ్ళ గొడవల నుంచి డ్రగ్స్ వరకు మీడియా చాలా చూపించింది అని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఈ మరణాన్ని సిబిఐతో పాటు ఈడి, ఎన్‌సిబి దర్యాప్తు చేస్తున్నాయని అన్నారు.
సిబిఐ దర్యాప్తు అయ్యే వరకు అందరూ ఎదురు చూడాలని సుశాంత్ తో కలిసి ధోనీ బయోపిక్ లో నటించిన కుముద్ అన్నారు. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి లేకుండా చేసామని ఆయన ఆరోపించారు. అతని మరణం గురించి ‘బిగ్ బాస్’ చేసాము, మరియు ఇది పెద్ద విషాదమని కుముద్ అన్నారు. కానీ అతని తర్వాత ముగ్గురు నటులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరూ వారి గురించి మాట్లాడటం లేదని మండిపడ్డాడు.