బిగ్ బాస్: తన రెమ్యూనరేషన్ పై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్…!!

-

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో గా పేర్కొంది బిగ్ బాస్. ఇక భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ షో చూస్తూ ఉన్నారు. ఇక హిందీతో పాటు ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ వంటి భాషలలో కూడా బిగ్ బాస్ బాగానే విజయవంతమైందని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో 6వ సీజన్ నడుస్తోంది. ఇక హిందీలో అయితే దాదాపుగా 15 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నది ఇక మరికొద్ది రోజులలోనే 16 వ సీజన్ ప్రారంభం కాబోతున్నది. ఇక ఏప్పటి లాగానే ఈ షో కి హోస్ట్ గా సల్మాన్ ఖాన్ వ్యవహరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు కాను సల్మాన్ ఖాన్ కు రూ.1000 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంపై సల్మాన్ ఖాన్ స్పందించడం జరిగినట్లు తెలుస్తోంది.

తనకు వస్తున్న రేమ్యునరేషన్ వార్తలపై ఎలాంటి నిజం లేదని అంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటే ఇక తను జీవితాంతం ఎలాంటి పని చేయవలసిన అవసరం ఉండదు కదా అని తెలియజేశారు. ఇక సల్మాన్ ఖాన్.. నేను బిగ్ బాస్ షో చేస్తున్నానా లేదా అని ప్రతిసారి అడగడం తనకు విసుగ్గా అనిపిస్తుందని తెలియజేశారు. దీంతో కొన్నిసార్లు తనకి విసుగు వచ్చి హోస్టుగా ఉండనని కూడా చెప్పేసారట. ఇక నిర్వాహకులకు మరొక అవకాశం లేక తననే అడుగుతూ ఉంటారని తెలిపారు.

అంతటి రెమ్యూనరేషన్ తనకి వస్తూ ఉంటే..తను ఎన్నో ఖర్చులు చేస్తూ ఉండే వాడిని..అలాగే ఇన్కమ్ టాక్స్ వాళ్లు కూడా తనని ఎప్పటికీ గమనిస్తూ ఉండేవారని తెలియజేశారు సల్మాన్ ఖాన్.. ఇక ఈ షో ద్వారా ఎన్నో నేర్చుకున్నాను.. ఎంతోమంది వ్యక్తులు కొత్తగా పరిచయం అవుతున్నారని తెలియజేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news