నిన్న మూడో రోజు పొద్దున్నే చాయ్ మీద గొడవ. చాయ్ లో చక్కెర లేదని.. పాలు సరిగ్గా లేవని శ్రీముఖి గొడవ పెట్టడం… నేను ఉన్నన్ని రోజులు నేను వంట చేస్తా… మీకు వంట నచ్చకపోతే చెప్పండి… అంటూ హేమ పెద్దరికం తీసుకుంది.
అప్పుడే బిగ్ బాస్ 3 నాలుగో ఎపిసోడ్ ను పూర్తి చేసుకుంది. అంటే కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇంట్లో మూడు రోజులను పూర్తి చేసుకున్నారు.
నిన్న మూడో రోజు పొద్దున్నే చాయ్ మీద గొడవ. చాయ్ లో చక్కెర లేదని.. పాలు సరిగ్గా లేవని శ్రీముఖి గొడవ పెట్టడం… నేను ఉన్నన్ని రోజులు నేను వంట చేస్తా… మీకు వంట నచ్చకపోతే చెప్పండి… అంటూ హేమ పెద్దరికం తీసుకుంది.
అలా మూడో రోజు సరదాగా సాగుతుండగా.. బిగ్ బాస్ శివజ్యోతిని పిలిచి ఓ టాస్క్ ఇచ్చి.. దాన్ని కంటెస్టెంట్లు అందరికీ వివరించాలని చెప్పాడు. అది చిన్నపిల్లల్లా మారే టాస్క్. అంటే హౌస్ మేట్స్ అందరూ 5 నుంచి 10 సంవత్సరాల పిల్లల్లా మారిపోవాలి. వాళ్లు తమ చిన్నతనంలో ఎలా ఉన్నారో అలాగే ప్రవర్తించాలి.
వీళ్లకు కేర్ టేకర్స్ గా పునర్నవి, వరుణ్ ను బిగ్ బాస్ నియమించాడు. వెంటనే అందరూ టాస్క్ లో ఇన్వాల్వ్ అయి చిన్నపిల్లల్లా కాదు.. పిచ్చోళ్లలా చేశారు. వాళ్లను ఆపడం వరుణ్, పునర్నవి వల్ల కాలేదు.
ఈ టాస్క్ లోనే మహేశ్ విట్టా, రవి మధ్య చిన్న గొడవ జరిగింది. రవి… మహేశ్ ను కర్రోడు అనడంతో మహేశ్ కు కోపం వచ్చింది. తర్వాత రవి సారీ చెప్పినప్పటికీ… మహేశ్ కాస్త గుర్రుగానే ఉన్నాడు. ఈ విషయాన్ని మహేశ్.. కేర్ టేకర్ పునర్నవి దృష్టికి తీసుకొచ్చాడు.
ఆ తర్వాత వంట దగ్గర కూడా చిన్న గొడవ వచ్చింది. రాహుల్, శ్రీముఖి మధ్య చిన్న మిస్ అండర్ స్టాండింగ్ రావడంతో రాహుల్ కూడా కాసేపు భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో హౌస్ లో అసలు వేడి ప్రారంభం అయింది.
మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు.. అని శ్రీముఖి రాహుల్ ను అనడంతో అసలు గొడవ ప్రారంభం అయింది. దీంతో రాహుల్.. శ్రీముఖిని నిలదీశాడు. ఎందుకు ఇన్వాల్వ్ కాకూడదు.. అంటూ ప్రశ్నించాడు. ఆ తర్వాత హేమ కూడా ఇన్వాల్వ్ అయింది. అలా.. చిన్న గొడవ కాస్త పెరిగి పెద్దదయింది.. ఇంతలోనే బిగ్ బాస్ 3… నాలుగో ఎపిసోడ్ పూర్తయింది. చూద్దాం.. మరి ఐదో ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో?