బుల్లితెర ఎంటర్టైన్మెంట్ బిగ్‌బాస్ సీజన్-8 ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటికే ఏడు నామినేషన్స్ పూర్తి చేసుకున్నది. ప్రస్తుతం ఎనిమిదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ రౌండ్ నడుస్తోంది. గత వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారం మొదట్లో సోమ, మంగళవారాల్లో నామినేషన్స్ ప్రక్రియ సాగింది. ఎప్పుడు నామినేషన్స్ జరిగినా బిగ్‌బాస్‌లో గొడవలు కామన్. అందుకు అనుగుణంగానే ఈసారి కూడా కంటెస్టెంట్స్ బాగానే గొడవలు పడి షో రేటింగ్ పెంచడానికి బాగానే ప్రయత్నించారు.
ఇక ఈ వారం నామినేషన్స్‌లో నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ, మెహబూబ్, ప్రేరణ, హరితేజ, నయని పావని ఉన్నట్టు బిగ్‌బాస్ ప్రకటించేశాడు. అయితే, వీరిలో ఒకర్ని సేవ్ చేయొచ్చని చెప్పడంతో మెగా చీఫ్ గౌతమ్.. హరితేజను సేవ్ చేసాడు. దీంతో ఈ వారం నిఖిల్, విష్ణుప్రియ, మెహబూబ్, పృథ్వీ, ప్రేరణ, నయని పావని ఎలిమినేషన్ జాబితాలో ఉన్నారు. వీరందరిలో ఈసారి హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్లిపోతారో తెలియాలంటే లేటెస్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే.