గోషామహల్‌లో మరోసారి భారీగా కుంగిన నాలా రోడ్డు

-

గోషామహల్‌లో దారుణం చోటు చేసుకుంది. గోషామహల్‌లో మరోసారి భారీగా నాలా రోడ్డు కుంగిపోయింది. దారుసలామ్ రోడ్డు నుంచి చాక్నావాడికి వెళ్లే రూట్లో ప్లైవుడ్ దుకాణాల ముందు అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నాలా కుంగిపోయిందని స్తానికులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అంటున్నారు.

గోషామహల్‌లో మరోసారి భారీగా కుంగిన నాలా రోడ్డు

అతిపురాతనమైన నాలా కావడంతో కుంగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే.. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు విచారణ చేస్తున్నారు. వెంటనే అక్కడ నాలా రోడ్డు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. వాహనాదారులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చేస్తున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version